10-12-2025 02:35:10 AM
తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసిన కలెక్టర్ నారాయణరెడ్డి
రంగారెడ్డి, డిసెంబర్ 9 (విజయక్రాంతి): జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం మంగళవారం అట్టహాసంగా నిర్వహించారు. వేడుకలను పురస్కరించుకొని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ (కలెక్టరేట్) ఆవరణలో నూతనంగా నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆవిష్కరించారు. వేడుకలు లో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని జయజయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్వరాష్ట్రంలో జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కలెక్టర్ అకాంక్షించారు.
మలి విడత తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాల ప్రజల తో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మమేకమయ్యారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు వారిది గా ఉంటూ అధికారులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఫలాలను ప్రజలకు అందేలా చూడాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కూడా అమలులో ఉన్నందున ఎన్నికల నియమావళికి లోబడి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
అనంతరం అమరవీరుల కుటుంబాలు నీల దినేష్ చంద్ర, S/o నీల రమేశ్, ఏన్నెల్ల శేఖర్ రెడ్డి, కాకి కుమార్ S/o నరసింహ మరియు సాంస్కృతి కళాకారులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ జిల్లా రెవెన్యూ అధికారి సంగీత జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి సుసిందరావు, డిపిఓ సురేష్ మోహన్, కలెక్టరేట్ రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.