calender_icon.png 11 December, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.కోట్లు ముంచిన అత్యాశ

10-12-2025 02:35:48 AM

  1. అధిక వడ్డీ ఆశతో యాప్‌లో ఇద్దరు వైద్యుల 2.51 కోట్ల పెట్టుబడి
  2. తర్వాత కొందరిని చేర్పించిన వైనం
  3. అందరూ నిండా మునిగిన తీరు
  4. వరంగల్‌లో వెలుగులోకి ఘటన

వరంగల్ (మహబూబాబాద్), డిసెంబర్ 9 (విజయక్రాంతి): ఆన్‌లైన్ యాప్‌లో పెట్టుబడి పెడితే అనేక రెట్ల వడ్డీ వస్తుందని ఆశ చూపడంతో అత్యాశకుపోయిన వైద్యులు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నట్లు వరంగల్ నగరంలో ప్రచారం సాగుతోంది. ఓ ఆన్‌లైన్ యాప్ ద్వారా పెట్టిన పెట్టుబడికి నెలకు 5 శాతం నుంచి 20 శాతం వరకు వడ్డీ వస్తుందని, పూర్తి పారదర్శకంగా ఈ వ్యవహారం సాగుతుందని ప్రచారం చేయడంతో ముందుగా ఇద్దరు వైద్యులు ఇందులో చేరి కొంత డబ్బు పెట్టుబడి పెట్టినట్లు ప్రచారం సాగుతోంది.

ఆ ఇద్దరు వైద్యులు దాదాపు రూ.2.51 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఆ ఇద్దరికీ కొంత డబ్బులు ఆన్‌లైన్ ద్వారా వారి ఖాతాలో జమ చేశారు. ఇది చూసిన మరికొందరు వైద్యులు యాప్ ద్వారా ఆన్‌లైన్ వ్యాపారంలోకి దిగినట్లు ప్రచారం సాగుతోంది. తర్వాత మరికొందరు ఇందులో చేరడానికి ఒక మహిళ ప్రోత్సహించిందని, దీనికి తోడు ముందుగా చేరిన వారి లాభాలను ఆన్‌లైన్ ద్వారా చూపడంతో చాలామంది పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది.

ఎక్కువ మంది పెట్టుబడి పెట్టిన తర్వాత మరుసటి నెల వారికి లాభాలను ఆన్‌లైన్‌లో చూపిస్తున్నప్పటికీ డ్రా చేసుకునే అవకాశం లేదు. ఈ విషయంపై ఆరా తీసేందుకు ప్రయత్నించగా యాప్ నిర్వాహ కులెవ్వరూ స్పందించకపోవడంతో మోసపోయినట్లు గ్రహించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని, బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, పోగొట్టుకున్న డబ్బు కూడా కోట్ల రూపాయల్లో ఉంటుందని తెతుస్తున్నది.