10-12-2025 02:33:38 AM
మేడ్చల్, డిసెంబర్ 9 (విజయ క్రాంతి): ‘ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలు‘ లో భాగంగా మంగళవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఐడిఓసి) ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డిఆర్‌ఓ హరిప్రియ, ఆర్డిఓలు ఉపేందర్ రెడ్డి, శ్యాంప్రకాష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గోన్నారు.తెలంగాణ సాంస్కృతిక కళాకారులు ఆలపించిన ప్రభుత్వ ప్రజా పాలన, సంక్షేమం పై పాడిన పాటలు అందరిని ఎంతగానో అలరించాయి.