29-10-2025 12:20:34 AM
జిల్లాలో విజిలెన్స్ వారోత్సవాల నిర్వహణ
మెదక్, అక్టోబర్ 28 (విజయక్రాంతి) : అవినీతికి తావు లేకుండా పారదర్శకతతో కూడిన సమర్థ పాలనే లక్ష్యంగా ముందుకు పోతున్నామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదే శాల మేరకు స్టేట్ విజిలెన్స్ అవగాహన వా రోత్సవాల నిర్వహణలో భాగంగా విజిలెన్స్ డీఎస్పీ సతీష్ రెడ్డి, సీ.ఐ లు నాగుల్ మీరా, ప్రశాంత్, హరికృష్ణ, విజిలెన్స్ ఏజీ కోటేశ్వర్ రెడ్డి, విజిలెన్స్ ఏ.ఓతో కలిసి కలెక్టర్ సమగ్రత, అవినీతి నిర్మూలన, లంచం ఇవ్వచూ పడం, తీసుకోవడం నేరం వంటి అంశాలపై అధికారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి నవంబరు 2వ తేదీ వరకు కల్చర్ ఆఫ్ ఇంటెగ్రిటీ ఫర్ నేషన్స్ ప్రాస్పర్టీ అనే థీ మ్తో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పబ్లిక్లో అవినీతి నిర్మూలనపై క్విజ్ పోటీలు, వాక్ధాన్లు, మారథాన్లు, వీధి నాటకాలు, గ్రామసభలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదే శించారు.
అవినీతికి తావు లేకుండా పారదర్శకతతో కూడిన పని సంస్కృతిని నెలకొ ల్పేలా ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని వీడి నిజాయితీగా సామాజిక బాధ్యతగా మెలగాలని సూ చించారు. అన్ని శాఖల కార్యకలాపాల ఫైల్స్ ఈ ఆఫీస్ విధానం ద్వారా తీసుకురావడం వల్ల ఫైల్ మేనేజ్మెంట్ సిస్టం క్రమపద్ధతిలో ఉండటమే కాకుండా ఉద్యోగి బదిలీపై వెళ్లి నా కూడా మళ్లీ వచ్చే నూతన ఉద్యోగికి శాఖ ల పనితీరుపై అవగాహన కొరకు ఫైల్స్ భ ద్రంగా ఉంటాయని అన్నారు.
అవినీతిని నిరోధించడంలో పౌరులందరూ భాగస్వాములు కావాలని ప్రోత్సహించడం, సమగ్ర త, పారదర్శకత, జవాబుదారీతనం యొక్క సంస్కృతిని బలోపేతం చేయడం దీని ప్రధా న లక్ష్యంగా పేర్కొన్నారు. అనంతరం విజిలెన్స్ పోస్టర్స్ ను ఆవిష్కరించారు. కార్య క్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.