29-10-2025 12:22:03 AM
మాగనూరు అక్టోబర్ 28. ప్రభుత్వ అధికారులు అధికార పార్టీ నాయకులకు వత్తస్సు పలకడం మాని తమ విద్యుత్ ధర్మాన్ని నిర్వహించాలని మాగనూరు మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు ఎల్లారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత మూడు రోజుల నుంచి మాగనూరు మండలంలో వరి కొనుగోలు కేంద్రాలను, పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు.
కానీ అధికారులు మాత్రం ఉజ్జల్లి గ్రామంలో వరి కొ నుగోలు కేంద్రం ప్రారంభించేది ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేడని కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించకుండా మరుశట్టి రోజు ప్రారంభించడం చూస్తుంటే అధికారులు అధికార పార్టీ నా యకులకు వత్తస్సు పలుకుతున్నారని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అధికారులు అధికార పార్టీ నాయకులకు భయపడి కనీసం ఫోటో కాల్ పాటించకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుల జపం చేస్తున్నా అధికారుల పై వారు మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులకు మీరిచ్చే గౌరవం ఇదేనా అధికారులు కూడా వత్తస్సు పలకడం ఎంతవరకు సమంజమన్నారు.
ఉమ్మడి మండలా సింగల్ విం డో అధ్యక్షుడు ఫోటో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ల పక్కన వేయడం ఎంతవరకు సమంజసం ఆన్నా రు. మీరు అధికార పార్టీ నాయకులు చేసే పనిలో మీరు ఇబ్బంది పడే రోజులు తొందరలోనే ఉన్నాయి మేము కూడా మీ పేర్లు పింకు బుక్కులో రాసి పెట్టుకోవాల్సి వస్తుంది అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఇప్పుడు ఉన్నవారు రేపు వేరే వాళ్ళు వస్తారు ఇబ్బంది పడేది మీరే , వరి కొ నుగోలు ప్రారంభించే వారికి ఏ పదవులు లేవు . అయినా వారిచే మీరు ప్రారంభోత్సవాలు చే యిస్తున్నారు. అధికార పార్టీకి నాయకులకు వర్తస్తులు పలకడం మాని మీ విధులు సక్రమంగా నిర్వహించాలనివారుకోరారు.