calender_icon.png 5 December, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మర్రిగూడ అభివృద్ధే లక్ష్యం

05-12-2025 01:34:45 AM

మర్రిగూడ, డిసెంబర్ 4 (విజయ క్రాంతి): మండల కేంద్రమైన మర్రిగూడ అభివృద్ధియే నా లక్ష్యమని సర్పంచ్ అభ్యర్థి వీరమల్ల శిరీష లోకేష్ గౌడ్ ఇంటింటి ప్రచారంలో ప్రజల ముందు తన శైలిలో భాగంగా ప్రజలను ఓటు వేయాల్సిందిగా కోరుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా  జనరల్ మహిళ రిజర్వేషన్ ఉండడంతో ఉన్నత విద్యావంతులైన శిరీషను సర్పంచ్ గా ఎన్నుకునేందుకు పోటీ చేస్తున్నారు.

ఈ సందర్భంగా అభ్యర్థి వీరమల్ల శిరీష లోకేష్ గౌడ్ మాట్లాడుతూ, పోటీ చేసేందుకు  ప్రజలు తనను బలపరిచారని, ప్రజల అభ్యున్నతి కోసం , మర్రిగూడ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానంటూ మీ అమూల్యమైన ఓటు వేసి తన గెలుపు కోసం పూర్తి సహకారాలు అందించాలని గురువారం ఎస్సీ కాలనీలో, బస్టాండ్ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

మర్రిగూడ అభివృద్ధి, ప్రజాసేవి తన లక్ష్యమని కత్తెర గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలంటూ అభ్యర్థి శిరీష లోకేష్ గౌడ్ ఇంటింటి ప్రచారం లో భాగంగా దూసుకుపోతున్నారు. తన తండ్రి అయిన వీరన్న ముత్యాల గౌడ్ గతంలో సర్పంచిగా విధులు నిర్వహించి నిస్వార్థంతో మర్రిగూడను అభివృద్ధి చేశారని, అదేవిధంగా స్వార్ధనేహితంగా ప్రజలకు సేవలు అందించి మన్ననలు పొందడమే తన లక్ష్యమని అభ్యర్థి మర్రిగూడ ప్రజలను కోరుతున్నారు.