calender_icon.png 5 December, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు నివాళి

05-12-2025 01:33:54 AM

అబ్దుల్లాపూర్‌మెట్: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 4వ వర్థంతిని పురస్కరించుకుని మహానగరపాలక సంస్థ పెద్ద అంబర్‌పేట్ సర్కిల్ కార్యాలయంలో వర్థంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ ఎస్. రవీందర్‌రెడ్డి రోశయ్య చిత్రపట్టానికి పూలమాలలు వేసి నివాళిలర్పించారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కరచారి, అధికారులు కిరణ్, హరికుమార్, కాంగ్రెస్ నాయకులు చామ విజయశేఖర్‌రెడ్డి తదితరులున్నారు.