17-07-2025 12:39:21 AM
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి
బాన్సువాడ, జూలై 16 (విజయ క్రాంతి), మహిళలను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఎస్‌ఎంబీగార్డెన్‌లో ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సంఘాల కు మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంగా మహిళా సంఘాల ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. మహిళా సంఘాల ప్రతినిధులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ని, రాష్ట్ర ప్రభుత్వ ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ లను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్ మై, డిఆర్డిఓ సురేందర్, బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల శ్రీనివాస్, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.