17-07-2025 09:45:40 PM
కొండపాక: వివాహిత అదృశ్యమైన సంఘటన కొండపాక మండలం సిరిసినగాండ్ల గ్రామంలో చోటుచేసుకుంది. సిరిసినగండ్ల గ్రామానికి చెందిన చెంది సంతోష్ కుమార్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. మంగళవారం చెంది సంతోష్ కుమార్ భార్య దివ్య(24) ఆస్పత్రిలో చూపించుకుంటానని చెప్పడంతో ఆటోలో రమ్మని చెప్పడంతో కూతురు కోమలి(5)తో ఆటోలో సిద్దిపేటకు వస్తున్నానని చెప్పి రాత్రి వరకు రాకపోవడంతో టీహెచ్ఆర్ నగర్ లో గల తన తల్లి ఇంటి వద్దకు కూడా రాకపోవడంతో తన భార్య దివ్య కోసం బంధువుల వద్దకు చుట్టుపక్కల గ్రామాలలో విచారించిన ఎలాంటి ఆచూకీ తెలియకపోవడంతో సంతోష్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని త్రీ టౌన్ సిఐ విద్యాసాగర్ తెలిపారు.