calender_icon.png 18 July, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కానిస్టేబుల్‌ను అభినందించిన ఎస్పీ

17-07-2025 12:38:04 AM

ప్రపంచ పోలీస్ ఫైర్ గేమ్స్‌లో బ్రౌన్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ 

కామారెడ్డి, జూలై 16 (విజయ క్రాంతి), ప్రపంచ పోలీస్ ఫైర్ గేమ్స్ 2025లో యూఎస్‌ఏ లో జరిగిన షార్ట్ పుట్, 110 మీటర్ల పరుగు పందెంలో రెండు బ్రౌన్జ్ మెడల్స్ సాధించిన కామారెడ్డి జిల్లా కానిస్టేబుల్ మహమ్మద్ బాబాను బుధవారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తన చాంబర్లో సత్కరించి అభినందించారు.

ప్రపంచ స్థాయిలో పోలీస్ కానిస్టేబుల్ మహమ్మద్ బాబా సాధించిన రెండు మెడల్స్ జిల్లాకు ఎంతో గర్వకారణంగా నిలిచాయన్నారు. పోలీస్ శాఖ పేరు ప్రతిష్టలను ప్రపంచ స్థాయికి తీసుకువచ్చిన బాబాను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని క్రీడల్లో పాల్గొని భారతదేశ పేరును ప్రపంచ స్థాయిలో నిలిపే విధంగా కృషి చేయాలన్నారు.