calender_icon.png 17 July, 2025 | 2:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రంధాలయ నిర్మాణానికి దాతల సహకారం అభినందనీయం

17-07-2025 12:39:27 AM

ట్రస్ట్ సభ్యులు కొండమీద శ్రీనివాస్

పెన్ పహాడ్: స్వర్గీయ కార్గిల్  లాన్స్ నాయక్  పోలోజు గోపయ్య చారి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి సహకరించడం అభినందనీయమని ట్రస్ట్ సభ్యులు కొండమీద శ్రీనివాస్ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం చీదెళ్ల గ్రామానికి చెందిన TUTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లచ్చుమల్ల  వెంకన్న - మంజుల దంపతులు రూ.30,116/- అలాగే లాన్స్ నాయక్ గోపయ్య చారి సహోదరుడు, ఎంపీడీఓ పోలోజు సత్యనారాయణ - గాయత్రి  దంపతులు రూ. 25,000/- చెక్కులను గ్రంధాలయ అభివృద్ధి కోసం అందజేసినట్టు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. గ్రంధాలయ నిర్మాణ ఏర్పాటుకు సహకారానికి  గ్రామ ప్రజలు, రాజకీయ నాయకులు, యువత, మేధావులు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులు ముందుకు రావాలని కోరారు.