17-07-2025 09:31:57 PM
రామక్రిష్ణ టీబీ నోడల్ పర్సన్
మునగాల: మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రo ఆధ్వర్యంలో జగన్నాధపురం గ్రామంలో నిక్షయ్ శివిర్ క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. టీబి నోడల్ పర్సన్ రామకృష్ణ మాట్లాడుతూ... వారానికి మించి దగ్గు దగ్గినప్పుడు కళ్ళేలో రక్తపు చారలు పడటం, చాతిలో నొప్పి, బరువు తగ్గడం రాత్రిపూట జ్వరంతో పాటు చమటలు రావడం, ఆకలి ముందగించడం. క్షయవ్యాధి సోకిన వారు ఆరు నెలలో మందులు వాడటం ద్వారా పూర్తిగా నయమవుతుంది.
దీనినీ నిర్లక్ష్యం చేయడం ద్వారా ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిని మరణించవచ్చు. ముందు జాగ్రత్తగా ప్రజలకు వ్యాధి పట్ల అవగాహన కల్పించి పౌష్టికాహారం తీసుకోవాలని తెలియజేశారు. క్షయవ్యాధి సోకిన వారికి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి ప్రభుత్వం నుండి ఉచితంగా ఆరు నెలలు న్యూట్రిషన్ ఫుడ్ బాస్కెట్లు అందిస్తున్నాము,. ప్రజలు ప్రతి ఒక్కరూ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.