calender_icon.png 31 July, 2025 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యం

30-07-2025 01:32:48 AM

  1. హైదరాబాద్‌లో ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్
  2. జీహెఎంసీ కమిషనర్ కర్ణన్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 29 (విజయక్రాంతి)/ఎల్బీనగర్: గ్రేటర్ హైదరా బాద్ ప్రజల ఆరోగ్య భద్రతను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టినట్లు జీహెఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ తెలిపారు. మంగళవారం నుంచి ఆగస్టు 8 వరకు 150 వార్డుల్లో యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్‌ను ప్రజా భాగస్వామ్యంతో విజయవంతం చే యాలని ఆయన ప్రజలను కోరారు.

మంగళవారం చార్మినార్, ఎల్‌బి నగర్ జోన్‌ల లోని పలు ప్రాంతాల్లో కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరు గుపరిచే లక్ష్యంతో జీహెఎంసీ చేపట్టిన ఈ ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌ను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. పారిశుద్ధ్యానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా, చెత్త బుట్టల్లోనే వేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇంటికి వచ్చిన స్వచ్ఛ ఆటోలకే చెత్తను అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని స్పష్టం చేశారు. 10 రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక డ్రైవ్‌ను రెండు లేదా మూడు రోజుల్లో 30 వార్డుల చొప్పున పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. కమిషనర్ వెంట చార్మినార్ ఎమ్మెల్యే జుల్ఫికార్ అలీ, ఎమ్మెల్సీ రహమత్ బైగ్, శాలిబం డ కార్పొరేటర్ మహమ్మద్ ముస్తఫా అలీ, పాతేర్‌గట్టి కార్పొరేటర్ సయ్యద్ సోహైల్ ఖాద్రి, చార్మినార్ జోనల్ కమిషనర్ వెంక న్న, ఎల్‌బి నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఉన్నారు.