9 April, 2026 | 2:00 AM

పైలట్ శిక్షణా విద్యార్థినిపై లైంగిక దాడి

09-04-2026 12:00 AM

సికింద్రాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్ బేగంపేట లోని ఏవికన్స్ పైలెట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్’లో పైలెట్ కోర్సు అభ్యసిస్తున్న ఒక యువతిపై అదే సంస్థలో ఇన్‌స్పెక్టర్‌గా  విధులు నిర్వహిస్తున్న నసిముద్దీన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.

జనవరి 2025 నుంచి పైలట్ శిక్షణ ఇస్తాననే సాకుతో ఆమెపై పలుమార్లు అత్యాచారం చేయడమే కాకుండా, ఆ దృశ్యాలను ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్‌కు దిగాడు. బాధితురాలు ధైర్యం చేసి బేగంపేట పోలీసులను ఆశ్రయించడంతో ఈ అరాచకం బయటపడింది.

కేరళ రాష్ట్రానికి చెందిన నసిముద్దీన్‌కు దమ్మాయిగూడకు చెందిన మరో ఇన్‌స్పెక్టర్ సల్మాన్ కూడా సహకరించినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే స్పందించి ప్రధాన నిందితుడు నసిముద్దీన్‌ను అదుపు లోకి తీసుకున్నారు. ఒకే సంస్థలో పనిచేస్తూ విద్యార్థినికి అండగా ఉండవలసిన వీరు క్రూరంగా వ్యవహరించి ఆమె జీవితంతో ఆడుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బేగంపేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.