calender_icon.png 29 August, 2025 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం పూర్తిగా విఫలం!

29-08-2025 05:26:48 AM

వర్షాలతో ప్రజలు ఆగమవుతుంటే ముసీపై సీఎం రివ్యూ అవసరమా?

మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్

మెదక్(విజయక్రాంతి)/దౌల్తాబాద్: భారీ వర్షాలు, వరదలతో సగం తెలంగాణ ఆగమా గం అవుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చొని మూసీ సుందరీకరణ, స్పోర్ట్స్ మీద రివ్యూ నిర్వహిస్తున్నాడని, ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. గురువారం మెదక్ జిల్లాలో భారీ వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు.

హవేళీఘణపూర్ మండలం రాజ్‌పేట గ్రామంలో వరదలో చిక్కుకుని మృతి చెందిన వ్యక్తుల కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడు తూ.. రాజ్‌పేట వరదల్లో చిక్కుకున్న సత్యనారాయణ, యాదాగౌడ్‌లు కరెంట్ స్తంభం ఎక్కి నాలుగైదు గంటలు సహాయం కోసం ఎదురు చూశారని, వారికి తక్షణమే హెలిక్యాప్టర్‌ను పంపించి ఉంటే బతికేవారని ఆవేదన వ్యక్తం చేశారు.

చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సహాయం చేయాలని, నష్టపోయిన పం ట పొలాలకు ఎకరానికి రూ.25000 చొప్పు న నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.  దూప్‌సింగ్ తండా ఇంకా జలదిగ్బంధంలోనే ఉందని, సహాయం కోసం ఎదురుచూస్తున్నారని, తాగునీరు లేక వర్షపు నీటిని తాగుతు న్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

అనంతరం ఆయన పలు ప్రాంతాలను పరిశీలించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని సూరంపల్లి, దొమ్మాట, గాజులపల్లి గ్రామాల చెరువులను, రోడ్లను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.