29-08-2025 05:22:41 AM
రూ.225 కోట్లతో కృత్రిమ నిర్మాణం
హైదరాబాద్, సిటీ బ్యూరో ఆగస్టు 28 (విజయ క్రాంతి): పర్యాటకులను ఆకర్షించే అద్భుతమైన చారిత్రక కట్టడాలు, సంస్కృతికి హైదరాబాద్ ప్రసిద్ధి చెందింది. అయితే, సముద్ర తీరం లేకపోవడంతో బీచ్ అనుభూతిని పొందాలంటే నగరవాసులు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇకపై ఆ అవసరం లేదు. ముత్యాల నగరానికి త్వరలో కృ త్రిమ బీచ్ అందాలు తోడవ్వబోతున్నాయి.
ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా..
ఈ కృత్రిమ బీచ్‌ను నిజమైన బీచ్‌కు ఏమాత్రం తగ్గకుండా రూపొందించనున్నారు. ఇక్కడ సందర్శకుల కోసం అనేక ఆకర్షణీయమైన ఏర్పాట్లు చేయబోతున్నా రు. జల విలాసాలు... ఈ ప్రాజెక్టులో ము ఖ్యంగా ఆకట్టుకునే అంశం నీటిపై తేలియాడే విల్లాలు. వీటితో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు కూడా ఏర్పాటు చేస్తారు. సాహస క్రీడలు... థ్రిల్ కోరుకునే వారి కోసం బంగీ జంపింగ్, స్కేటింగ్, సెయిలింగ్ వంటి సాహస క్రీడలు అందుబాటులో ఉంటాయి.
వీటికి తోడు ప్రత్యేకంగా వింటర్ స్పోర్ట్స్‌ను కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కుటుంబ వినోదం... కుటుంబంతో కలిసి ఆనందించేందుకు వీలుగా పార్కులు, పిల్లల ఆట స్థలా లు, సైక్లింగ్ జోన్లు, జాగింగ్ ట్రాక్లు ఉంటా యి. అదనపు ఆకర్షణలు.. ఫుడ్ కోర్టులు, థియేటర్లు, అలంకార ఫౌంటెన్లు, వేవ్ పూల్స్ వంటి విశ్రాంతి స్థలాలు సందర్శకులను కట్టిపడేస్తాయి. అన్ని రకాల సదుపాయాలతో ఇది కేవలం ఒక బీచ్గా కాకుండా, ఒక సంపూర్ణ వినోద కేంద్రంగా మారబోతోంది.
ఔటర్ రింగ్ రోడ్కు సమీపంలో ఉండటంతో నగరంలో ఎక్కడి నుంచైనా సులభంగా చేరుకునే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయి తే హైదరాబాద్ పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
కొత్వాల్‌గూడలో భారీ ప్రాజెక్టు..
హైదరాబాద్‌కు సమీపంలోని కొత్వాల్‌గూడలో వద్ద 35 ఎకరాల విస్తీర్ణం లో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రణాళికలను కూడా ఇప్పటికే ఖరారు చేసింది. దాదాపు రూ.225 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో దీన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు డిసెంబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.