2 July, 2026 | 4:27 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

ప్రజలను మోసం చేస్తున్నసర్కారు

03-12-2024 02:13 AM

ఎమ్మెల్యే రామారావుపటేల్

భైంసా, డిసెంబర్ 2: ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామా రావుపటేల్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు భైంసాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై శ్వేతపత్రాన్ని సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. కాళేశ్వరం పేరుతో మాజీ సీఎం అవినీతికి పాల్పడితే ప్రస్తుత సీఎం హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో అదే పనిచేస్తున్నారని ఆరోపించారు.

హామీలు నెరవేర్చకుండా మోసానికి పాల్పడుతున్నారన్నారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న విఠల్‌రెడ్డి గుండెగాం పునరావాసం పూర్తిచేయలేకపోయారని, బాసర సరస్వతి ఆలయ అభివృద్ధిని విస్మరించారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఈనెల 5న భైంసా ఎస్‌ఎస్ జిన్నింగ్ మిల్లులో భారీ బహిరంగసభ నిర్వహిస్తామని, బీజేపీ శ్రేణులు, ప్రజలు అధికసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం పలువురికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీ గంగాధర్, ఏఎంసీ మాజీ చైర్మన్ రాజేశ్‌బాబు, నాయకులు నారాయణరెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.