calender_icon.png 3 January, 2026 | 6:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓసీ క్లబ్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

03-01-2026 12:00:00 AM

అదనపు కలెక్టర్‌కు సీపీఐ విజ్ఞప్తి

మహబూబాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): ఓసీ క్లబ్ పేరుతో చలామణిలో ఉన్న ప్రభుత్వ క్లబ్ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడంలో జాప్యం తగదని, వెంటనే ఓసీ క్లబ్ ను స్వాధీనం చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అనీల్ కుమార్ ను  సీపీఐ నాయకులు కోరారు. ఈ మేరకు మున్సిపల్ సీపీఐ మాజీ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ ను కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అజయ్ సారధి రెడ్డి మాట్లాడుతూ కొంతమంది కబ్జా చేయాలని చూస్తున్నారని, గతంలో టిఆర్‌ఎస్ హయాంలో కొంతమంది ప్రజా ప్రతినిధులు వేరే పేరుతో అక్రమంగా కబ్జా చేయాలని చూస్తే నాడు మున్సిపాలిటీ కౌన్సిల్ లో, ప్రజాక్షేత్రంలో అది ముమ్మాటికి మున్సిపాలిటీ ప్రభుత్వానిదే అని పోరాటం చేసినట్లు చెప్పారు.

సీపీఐ ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమించామని, ఈ విషయంపై మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళి నాయక్, ఎంపీ పోరిక బలరాం నాయక్ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు చెప్పారు.  వందల కోట్ల విలువైన స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించాలని కోరారు. కళాక్షేత్రం, ఎడ్యుకేషనల్ హబ్ ఇండోర్ స్టేడియం లాంటివి ఏర్పాటు చేసి, పట్టణ ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పెరుగు కుమార్, వీరవెల్లి రవి, ఎండి మహమూద్, గార రవిచంద్రబోస్ పాల్గొన్నారు.