03-01-2026 05:25:02 PM
సవరించాలంటూ సీపీఎం ఆందోళన
మహబూబాబాద్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో జారీ చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో పూర్తిగా తప్పులు ఉన్నాయని, వాటిని వెంటనే సవరించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో మహబూబాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలోని మొత్తం 36 వార్డుల్లో ఓటర్ల జాబితా లు తప్పుల తడకగా ఉన్నట్లు సిపిఎం మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుర్నపు సోమయ్య ఆరపించారు.
కొన్ని వార్డుల్లో ఓట్లు చాలా వరకు పెరిగాయని, మున్సిపల్ అధికారులు వార్డు బాధ్యుల ఆఫీసర్లు సమగ్రంగా వార్డుల్లో పర్యటించి లోపాలను సరిచేయాలని కోరారు. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ బూత్ ల ప్రకారంగా ఉన్న ఓటర్ల జాబితాను వెంటనే ఎటువంటి పొరపాట్లు లేకుండా 2020 లో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రకారంగా చేయాలని కోరారు. ఈ మేరకు మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ కు వినతి పత్రం ఇచ్చారు.