03-01-2026 05:05:16 PM
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని నటరాజ్ నగర్ లోని సంస్కార్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల పిల్లలు వాళ్ళ ఇంట్లో తయారుచేసిన తినుబండారాలు తీసుకువచ్చి పాఠశాలలో విక్రయించడం, ఈ కార్యక్రమంలో పిల్లలు ఎంతో ఉత్సాహంగా వాళ్ళు తెచ్చిన బండారాలను కొనుక్కొని తిన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు వ్యాపారం ఎలా జరుగునో మరియు డబ్బుల డబ్బుల విలువ గురించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ అయ్యన్న గారి శ్రీధర్ ప్రిన్సిపల్ అయ్యన గారి రచన మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.