calender_icon.png 4 January, 2026 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు సకాలంలో చెల్లించాలి

03-01-2026 05:09:31 PM

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ 

మహబూబాబాద్,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఆయా దశల్లో లబ్ధిదారులకు చెల్లించాల్సిన బిల్లులను బకాయిలు లేకుండా చెల్లించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, రెండు పడకల గదుల నిర్మాణాలపై శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో మరింత వేగంతో పూర్తి చేయాలని, ఇప్పటికే వివిధ దశలలో ఉన్న నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు జమ చేయుటకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇప్పటికే మంజూరై ఇందిరమ్మ ఇండ్లు నిర్మించూ కొని లబ్ధిదారులను గుర్తించి స్వయం సహాయక డ్వాక్రా గ్రూపుల ద్వారా ఆర్థిక సహాయం అందించుట కోసం ఎంపీడీవోలు, ఏపిఎంలు కృషిచేసి ఇండ్లు నిర్మించుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

క్షేత్రస్థాయిలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, హౌసింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది లబ్ధిదారుల వివరాల సేకరణలో స్పష్టమైన ఫోటోల అప్లోడింగ్ చేయాలని, ఐటీడీఏ కోట,పీఎంఈవైకు సంబంధించి గ్రామీణ,పట్టణ, ప్రాంతాల్లో వివరాలు సేకరించాలన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం అమలు చేస్తున్నట్లు పేద అర్హులైన ప్రజలకు క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలని అందుకోసం హౌసింగ్, రెవిన్యూ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, హౌసింగ్ డిఈ, ఏఈలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చర్యలు తీసుకోవాలని సూచించారు.