calender_icon.png 4 January, 2026 | 4:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ రోడ్డు భద్రతా -2026 మాసోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ

03-01-2026 05:29:09 PM

నో హెల్మెట్ – నో పెట్రోల్” నినాదంతో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత–నిబంధనలు పాటిద్దాం, ప్రాణాలు కాపాడుకుందాం: జిల్లా ఎస్పీ 

నల్గొండ క్రైమ్: రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రత 2026 నా షోత్సవాల పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రజల ప్రాణాలను కాపాడాలనే  లక్ష్యంతో ఈ నెల 31 వరకు జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మానవ నిర్లక్ష్యం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన వల్లే జరుగుతున్నాయని, ప్రజలలో అవగాహనతో నే ప్రమాదాలను నివారించవచ్చు అన్నారు.

ఈ మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలోని విద్యాసంస్థలు, బస్సు స్టాండ్లు, ప్రధాన కూడళ్లు, మార్కెట్ ప్రాంతాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో, ఆటో,లారి డ్రైవర్ లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు ద్వారా విస్తృత ప్రచారం చేపడుతున్నట్లు  వివరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి తలకు తీవ్ర గాయాలు తగిలి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  మోటర్ వాహనాల చట్టం 1988 ప్రకారం హెల్మెట్ వినియోగాన్ని తప్పనిసరిగా అమలు చేయాలనే ఉద్దేశంతో నో హెల్మెట్ – నో పెట్రోల్* ” అనే నినాదాన్ని జిల్లాలో అమలు చేస్తున్నట్లు తెలిపారు.

జిల్లాలోని అన్ని పెట్రోల్ బంక్ యజమానులతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించి, ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా ప్రజల ప్రాణాలు కాపాడుటలో మీ వంతు సహకారంగా హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకే పెట్రోల్ అందించే విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని వారికీ సూచించినట్లు  తెలిపారు. జిల్లాలోని ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని, హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్ పోయారన్నారు. ప్రతి వాహనదారుడు సీటుబెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, అధిక వేగంతో వాహనాలు నడపరాదని, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నారు.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటూనే, అవసరమైన చోట కౌన్సిలింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి,అడిషనల్ ఎస్పి రమేష్,నల్లగొండ డిఎస్పీ  శివరాం రెడ్డి,జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి లావణ్య,ఎస్.బి సీఐ రాము,2టౌన్ సీఐ రాఘవరావు,1టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి,డి.టి.ఆర్బి రిటైర్ సీఐ అంజయ్య తదితరులు పాల్గొన్నారు