03-01-2026 05:16:21 PM
మోతే,(విజయక్రాంతి): రోడ్డు భద్రత పై ప్రతి ఒక్కరు అవగాహనతో వాహనాలు నడపాలని ఎస్ఐ టీ.అజయ్ కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత మహోత్సవంలో పాల్గొని మాట్లాడారు. జనవరి 1 నుంచి 31 వరకు రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.
ట్రాఫిక్ రూల్స్ డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. అనంతరం పోలీసు కళా బృందం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కె జి బి వి పాఠశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ క్రాంతి కుమారి, హెడ్ కాన్సిస్టెబుల్ శ్రీకాంత్, కళా కారులు యల్లయ్య, గోపయ్య చారి, సత్యం, కృష్ణ, గురు లింగం, నాగార్జున, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.