calender_icon.png 4 January, 2026 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద కుటుంబాలకు వైద్య సేవలు

03-01-2026 05:22:37 PM

దత్తత కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మెడికల్ విద్యార్థులు

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని బూరుగూడ గ్రామంలో పేద కుటుంబాలకు ఆరోగ్య సేవలు అందించేందుకు ఆసిఫాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ విద్యార్థులు శనివారం కుటుంబ దత్తత కార్యక్రమాన్ని ఆరోగ్య విద్యావేత్త రషీద్ ప్రారంభించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఒక్కో ఎంబీబీఎస్ విద్యార్థి మూడు కుటుంబాలను దత్తత తీసుకుని, వారి పూర్తి ఆరోగ్య సమాచారాన్ని సేకరించి హెల్త్ ప్రొఫైల్ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. సేకరించిన వివరాల ఆధారంగా కుటుంబ సభ్యులకు అవసరమైన ఆరోగ్య సూచనలు, ప్రాథమిక వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సులో చేరిన విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం వల్ల, కోర్సు పూర్తయ్యే నాటికి విద్యార్థులకు వైద్యులుగా క్షేత్రస్థాయి అనుభవం లభిస్తుందని అన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల ప్రాధాన్యత ఎంత ముఖ్యమో ప్రత్యక్షంగా అవగాహన కలుగుతుందని వివరించారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య విద్యావేత్తలు రషీద్, లలిత, ఎల్‌టీ సమ్రీన్, డీఓ సురేష్, మెడికోలు తదితరులు పాల్గొన్నారు.