calender_icon.png 5 August, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ మీద నిందలు మోపడానికే కమిషన్ నివేదికను 60 పేజీలకు కుదించారు

05-08-2025 01:54:04 AM

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): బనకచర్లకు నీళ్లను మలిపేందుకే కాళేశ్వరం మీద కక్ష గట్టారని, అందుకే దానిని విఫలంగా చూపే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మీద నిందలు మోపడానికి 665 పేజీల ఘోష్ కమీషన్ నివేదికను 60 పేజీలకు కుదించి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

కాళేశ్వరం కమిషన్ నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో నిరంజన్ రెడ్డి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. సైట్ మార్చడం గురించి కాంగ్రెస్ మాట్లాడ టం హాస్యాస్పదంగా ఉంద న్నారు. తెలంగా ణ గొంతు తడపడానికే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారని.. అన్ని అనుమ తులతో నిర్మించిన కాళేశ్వరం మీద విషం చిమ్ముతున్నారన్నారు.

పచ్చబడ్డ తెలంగాణ ను చూసి ఓర్వలేక పోతున్నారని,ఘోష్ కమీషన్ నివేదికను యధాతథంగా ఎందుకు బహిర్గతం చేయలేదో చెప్పాలన్నారు. కమీష న్ ఇచ్చిన నివేదిక ఫైన ల్ కాదని.. దాని మీద కోర్టుకు వెళ్లవచ్చు అని కమీషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్‌లోనే ఉందని నిరంజన్ రెడ్డి అన్నారు. మేడిగడ్డకు బరాజ్ ఎందుకు మార్చారో వందల సార్లు వెల్లడించారని.. నీటిలభ్యత లేకపోవడం, మహారాష్ర్ట ఒప్పుకోకపోవడంతో సైట్ మార్చారని, సీడబ్లూసీ దానికి ఆమోదం తెలిపిందన్నారు.

కాళేశ్వరం ఎత్తిపోతల్లో మేడిగడ్డ లో కుంగింది మూడు పిల్లర్లు అయితే మూ డు బ్యారేజీలు కూలిపోయాయని అబద్ధపు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. తెలంగాణలోని వాగులు, వంకల మీద కేసీఆర్‌కి సంపూర్ణ అవగాహన ఉందని, అందుకే కాళేశ్వరం నిర్మాణం సాధ్యమయిందన్నారు. 90 శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లో మిగిలిన పనులను ఎందుకు పూర్తి చేయడం లేదని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.