26-07-2025 12:00:00 AM
నాగల్ గిద్దలో రేషన్ కార్డుల పంపిణీ
నాగల్ గిద్ద, జూలై 25: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు కడుపునిండా సన్నబియ్యం పెట్టాలన్న లక్ష్యంతో అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులను అందజేస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్టోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన నాగల్గిద్దలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మొత్తం కొత్త రేషన్ కార్డులు 1069 అప్లై చేయగా వారిలో 811 మంజూరయ్యాయని, యాడింగ్ పేరు నమోదులో చేసిన వారు 1792 ఉండగా అందులో వంద శాతం పూర్తయినట్లు ఎమ్మార్వో శివకృష్ణ తెలిపారు. కాగా కొత్త కార్డులను ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.
కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం...
మండల పరిధిలోని ఎస్గి గ్రామంలో గ్రామ స్వరాజ్యం సంస్థ కుట్టు శిక్షణా కేంద్రాన్నిఎమ్మెల్యే ప్రారంభించారు. కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం వల్ల పేద, మధ్యతరగతి మహిళాలకు గొప్ప అవకాశమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లో మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు కూడా అందిస్తున్నామని, ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాగల్ గిద్ద తహసీల్దార్ శివకృష్ణ, ఎంపీడీవో మహేశ్వర రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రహీం, మహిళా సమైక్య మండల అధ్యక్షురాలు హీనా బేగం, కార్యదర్శి, ట్రైనర్ విజయలక్ష్మి, మాజీ సర్పంచ్ విట్టల్ రావు పాటిల్, పాక్స్ వైస్ చైర్మన్ అంజి రెడ్డి, రహీమ్, గుండె రావు పాటిల్, అనిల్ పాటిల్, నారాయణ జాదవ్, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.