calender_icon.png 27 July, 2025 | 4:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం

26-07-2025 12:00:00 AM

 ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి 

 నాగర్ కర్నూల్ జులై 25 విజయక్రాంతి;  గ్రామాలు అన్ని విధాల అభివృద్ధి చెందినప్పుడే దే శం బాగుపడుతుందని గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని నాగర్ క ర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ మండలం గుడిపల్లి గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్సీ కూచుకున్న దామోదర్ రెడ్డి నిధులతో ఏర్పాటు చేసిన బస్టాండ్ ప్రయాణ ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించారు.

అనంతరం గ్రామంలోని బిఆర్‌ఎస్ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు రావడంతో వా రికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అంతకుముందు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం విజయవంతం కావడంతో నిర్వహించిన సంబ రాల్లో పాల్గొన్నారు. వారితోపాటు మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, వెంకట్ రామ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లయ్య, గ్రామ అధ్యక్షుడు మల్లయ్య, శివ, నరేష్ , అశోక్ రెడ్డి గ్రామ నాయకులు తదితరులుపాల్గొన్నారు.