08-12-2025 01:13:52 AM
ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి
మానకొండూర్, డిసెంబరు 7 (విజయక్రాంతి): పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నిర్వీర్యమైన పంచాయతీలను పటిష్టం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదివారం గన్నేరువరం మండలంలోని పార్వెల్ల, గన్నేరువరం, చొక్కారావుపల్లి, యాస్వాడ, సాంబయ్యపల్లి మాదాపూర్, జంగపల్లి, గునుకుల కొం డాపూర్, చీమలకుంటపల్లి గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా అయిన మాట్లాడుతూ ఈనెల 14న జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచులు, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ప్రతిపక్షాలు చేసే అబద్దపు ప్రచారాలను నమ్మి మోసపోకుండా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులనే గెలిపించాలన్నారు.
ఈ కార్యక్రమాల్లో గన్నేరువరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, బుర్ర తిరుపతి గౌడ్, అరికాంతం గోపాల్ రెడ్డి, కటకం తిరుపతి, సంగు లక్ష్మి - దేవయ్య, బొడ్డు సునిల్, జువ్వాడి మన్మోహన్ రావు, సిహెచ్ శ్రీధర్ రెడ్డి, మాతంగి అనిల్, నల్ల చంద్రారెడ్డి, ఈగ రాజయ్య, ఎం తిరుపతిరెడ్డి, మామిడిపల్లి అంజయ్య, గడ్డం మహిపాల్ రెడ్డి, గంగాధర అంజి, వరుకోలు వెంకట్, నాగపురి శంకర్, బామండ్ల అంజితోపాటు సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులుపాల్గొన్నారు.