09-09-2025 12:00:00 AM
టేక్మాల్ మండలంలో రూ.30 కోట్ల పనులకు శంకుస్థాపనలు
టేక్మాల్ (మెదక్), సెప్టెంబర్ 8 (విజయక్రాంతి):పల్లెల ప్రగతికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యతనిస్తూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగిస్తుందని, మోడ ల్ పాఠశాల, కళాశాలకు మౌలిక వసతులు కల్పిస్తూ నాణ్యమైన గుణాత్మక విద్య అందిం చే దిశగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వై ద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.
సోమవారం టేక్మాల్ మం డలంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మాత్యులు శ్రీ దామోదర్ రాజనర్సింహ టేక్మాల్ మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ధన్నూర గ్రామంలో రూ.400 లక్షల అంచనా వ్య యంతో మెదక్ జిల్లాలో కొత్తపల్లి నుండి చింతకుంట వరకు రోడ్డును, టేక్మాల్ ధను రా రోడ్డుకు రూ.300 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు పటిష్టపరుచుటకు శంకుస్థాపన చేశా రు.
అనంతరం గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ ఎన్టిఎఫ్డిఎఫ్ నిధులతో రూ.5.19 కోట్ల వ్యయంతో ఎల్లుపల్లి తాండ, మొరవని కుంట తండా, యోగ్యతాండ మీదుగా ఆర్ అండ్ బి రోడ్డు టు ఎల్లుపేట ఎక్స్ రోడ్ వర కు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించా రు. అనంతరం మోడల్ స్కూల్ ను పరిశీలించారు.
మోడల్ స్కూల్ మౌలిక వసతులపై సంబంధిత జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఉ పాధ్యాయులతో సంప్రదింపులు జరిపి, కం ప్యూటర్ ల్యాబ్ వెంటనే ప్రారంభించాలని, మీకు కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూ.326 లక్షల వ్యయంతో ఆర్‌అండ్ బి రోడ్డు నుండి వెంకటాపూర్ తండా వరకు బిటి రోడ్డు, ర హదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నార్సింగి నుండి శంకరంపేట వరకు రూ. 1300 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు.
శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కా ర్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెదక్ ఆర్డీవో రమాదేవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, డీఎస్పీ ప్రస న్నకుమార్, ఆర్ అండ్ బి ఈఈ సర్దార్ సిం గ్, పంచాయతీరాజ్ ఈఈ నరసింహులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి నీలిమ, ట్రైబల్ వెల్ఫేర్ డీఈ భాషా, వివిధ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.