09-09-2025 12:00:00 AM
మహబూబాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): మహబూబాబాద్ పట్టణ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న గాజుల రవి మరణించాడు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమి షనర్ టీ.రాజేశ్వర్ మృతుడి ఇంటికి వెళ్లి, రవి భౌతిక కాయంపై పుష్ప గుచ్చం ఉంచి నివాళులర్పించారు. రవి అంత్యక్రియల నిమిత్తం 10 వేల రూపాయల ప్రభుత్వ సహాయంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు కర్ణాకర్, రాజేష్, వార్డు ఆఫీసర్ భారత్, మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి కాంప ల్లి శ్రీనివాస్, చిరంజీవి కృష్ణ శ్రీని వాస్ పుష్ప రాజ్ పాల్గొన్నారు. కాగా మృతుడి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనివ్వాలని, ము త్తిడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సిఐటియు పట్టణ కార్య దర్శి కుమ్మరి కుంట్ల నాగన్న, కందు కూరు జానీ, సైదులు, వీరన్న, మనో హర్, లక్ష్మయ్య, దయాకర్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. మృతుడి కుటుం బానికి సానుభూతి తెలియజేశారు.