calender_icon.png 26 August, 2025 | 11:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పగడ్బందీగా రైతుల ధాన్యాన్ని విక్రయించాలి

27-11-2024 05:35:24 PM

ముత్తారం మండల పర్యటనలో అదనపు కలెక్టర్ వేణు 

ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండలంలో పగడ్బందీగా రైతుల వరి ధాన్యాన్ని విక్రయించాలని అదనపు కలెక్టర్  వేణు అన్నారు. బుధవారం పీఏసీఎస్ కొనుగోలు కేంకేంద్రాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. మండలంలోని పారుపల్లి, ముత్తారం గ్రామాలలో ధాన్యం కేంద్రాలలో రైతులతో మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు తహశీల్దార్ కార్యాలయం సందర్శించారు. ఆయన వెంట తహశీల్దార్ సుమాన్, నాయబ్ తహశీల్దార్ షఫీ, గీర్దావర్ శ్రీధర్, సీనియర్ సహాయకులు భవానీ ప్రసాద్  కార్యాలయ సిబ్బంది ఉన్నారు.