12-04-2025 12:00:00 AM
చెన్నూర్, ఏప్రిల్ 11 : కోటపెల్లి మండలం జనగామ పంచాయతీ పరిధిలోని శివరాంపల్లి సమీపంలో గల రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్ర వారం కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో జనగామ, సూపక, అలుగామ, వెంచపల్లి గ్రామాలతో పాటు మహారాష్ట్రలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి కళ్యాణాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.