12-04-2025 12:00:00 AM
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి):పదోన్నతి ఉత్సాహంతో పాటు మరింత బాధ్యత పెంచుతుందనీ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు అన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్స్‌గా విధులు నిర్వర్తిస్తు హెడ్ కానిస్టేబుల్స్‌గా పదోన్నతి పొంది జిల్లాకు వచ్చిన ఆరుగురు పోలీస్ సిబ్బంది శుక్రవారం జిల్లా ఎస్పీనీ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో పదోన్నతి ఎంతో ఉత్సాహానిస్తుందని, దాంతోపాటు బాధ్యతను కూడా పెంచుతుందని తెలిపారు. విధి నిర్వహణలో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రజల కు మంచి సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారు లు తదితరులు పాల్గొన్నారు.