పాము కాటుతో విద్యార్థి మృతి
07-08-2026 12:08 AM
నారాయణపేట జిల్లా ఎక్లాస్‌పూర్‌లో ఘటన
నారాయణపేట ఆగస్టు 6 : మండలం ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన పిచ్చికుం ట్ల రంజిత్ కుమార్ (3వ తరగతి) విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో పాము కాటుకు గురై మృతి చెందిన విషాద ఘటన గురువారం చోటుచేసుకుంది. ఎప్పటిలాగే ఉదయం పాఠశాలకు వెళ్లిన రంజిత్ కుమార్ తరగతి గదిలో కిటికీ పక్కన కూర్చున్నాడు.
కిటికీ గుండా లోపలికి వచ్చిన పాము బాలుడిని కాటేసింది. గమనించిన ఉపాధ్యాయుడు వెంటనే బాలుడిని నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడి పరిస్థితి విషమించడంతో మృతిచెందారు. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్రఆవేదన వ్యక్తంచేశారు. బాధ్యు లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.






