calender_icon.png 6 September, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానదీపం గురువు

06-09-2025 01:34:40 AM

  1. ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు
  2. మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్

కొత్తగూడెం, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానదీపం గురువు అని, ఉపాధ్యాయులను ప్రతిఒక్కరూ గౌరవించాలని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్ పేర్కొన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం సంద ర్భంగా కొత్తగూడెం కార్పొరేషన్ 12వ వార్డు సుభాష్ చంద్రబోస్ నగర్‌లోని మోడ్రన్ ఇఖ్రా స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సమాజంలో ఎంత గొప్పస్థానంలో ఉన్నా, వారంతా ఒకప్పుడు ఓనమాలు నేర్చుకున్నది.

ఉపాధ్యాయుల వద్దనే అని, కాబట్టి ఉపాధ్యాయులను గౌరవించడం మరువొద్దన్నారు. నేడు విద్య వ్యా పారంగా మారిపోయిందని ఉపాధ్యా య వృత్తి అంటే గౌరవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులను సదా గౌరవ భావంతో చూస్తూ, వారి వద్ద జ్ఞానాన్ని అర్థించి, జీవితంలో ఉన్నత స్థాయి కి ఎదిగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల ఔన్న త్యాన్ని కీర్తిస్తూ తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో చేసిన ప్రసంగాలు, నృత్య ప్రదర్శనలు, నాటికలు అలరించాయి. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించా రు. కార్యక్రమంలో ప్రధాన అధ్యాపకురాలు పర్వీన్ సుల్తానా, టీచర్లు నీలా, లక్ష్మీ ప్రసన్న, నస్రత్, సరస్వతీ, సల్మా, విజయ లక్ష్మి, జేఫీషా, ఖాజా, అనితా పాల్గొన్నారు.