calender_icon.png 6 September, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణకు గర్వకారణం

06-09-2025 01:32:17 AM

  1. న్యాక్ ట్రైనర్‌కు జాతీయ అవార్డు రావడం అభినందనీయం 
  2. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  3. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న స్నేహలత
  4. అభినందించిన మంత్రి 

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాం తి): ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నేషనల్ అకాడమీ ఆప్ కన్‌స్ట్రక్షన్(న్యాక్) ట్రైనర్ స్నేహలతకు రాష్ట్రపతి చేతుల మీ దుగా జాతీయ అవార్డు రావడం పట్ల తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభి నందించారు. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ విభాగంలో రా ష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా శుక్రవారం ఢిల్లీలో జాతీయ ఉత్తమ టీచర్స్ అవా ర్డు అందుకున్న న్యాక్  ట్రైనర్ స్నేహలతకు ఫోన్ చేసి మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆమె న్యాక్ ద్వారా నిరుద్యోగ యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా, కరీంనగర్, జగిత్యాల పట్టణాల్లో నిరుద్యోగ యువతకు సర్టి ఫికెట్ కోర్సులు, ఉద్యోగ అవకాశాలు కల్పించే వృత్తివిద్యా కోర్సులను అందిస్తూ, ఉత్తమ బోధన అందించేందుకు చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కిందని కొనియాడారు.

దేశ వ్యాప్తంగా 13 మంది ఈ అవా ర్డుకు ఎంపికైతే తెలంగాణ నుంచి న్యాక్ ఇన్‌స్ట్రక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న హన్మ కొండకు చెందిన నక్క స్నేహలతకు జాతీయ అవార్డు రావడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అని మంత్రి అన్నారు. నైపుణ్యాలకు ఉత్తమ వేదికగా న్యాక్‌ను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. వేలాది మందికి నాణ్య మైన నైపుణ్య శిక్షణ ఇస్తూ ఉపాధి కల్పన పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచ నల మేరకు  విద్యార్థుల్లో స్కిల్‌డెవలప్మెంట్ పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యా ప్తంగా తెలంగాణ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలి పారు. హైదరాబాద్ వేదికగా న్యాక్ ద్వారా శిక్షణ ఇవ్వడమే కాకుండా 100 శాతం ఉపా ధి కల్పించడమే లక్ష్యంగా న్యాక్ పని చేస్తోందని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు.