calender_icon.png 9 August, 2025 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయుధ కొనుగోళ్ల నిలిపివేత అవాస్తవం

09-08-2025 02:59:52 AM

రాయిటర్స్ కథనంపై భారత రక్షణ శాఖ స్పష్టత

న్యూఢిల్లీ, ఆగస్టు 8: అమెరికా సుంకాలకు ప్రతిస్పందనగా ఆ దేశం నుంచి ఆయు ధాలు, విమానల కొనుగోలు ప్రణాళికను భారత్ నిలిపివేసిందంటూ వచ్చిన రాయిటర్స్ ప్రచురించిన వార్త కథనాన్ని భారత రక్షణ శాఖ తోసిపుచ్చింది. ఆ దేశం నుంచి ఆయుధాలు, యుద్ధ విమానాల కొనుగోళ్లను నిలిపివేయాలని భారత్ నిర్ణయిం చినట్టు రాయిటర్స్ వెలువరించిన కథనం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. 

భారత్ దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై అమెరికా అదనంగా 25 శాతం సుంకం విధించడంతో సుంకాలు 50 శాతానికి చేరిన వేళ భారత్ ఆయుధాల కొనుగోళ్లు నిలిపివేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. ‘భారత్ తాజాగా తీసుకున్న అనూహ్య నిర్ణయంతో సుమారు 3.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 30 కోట్లు) విలువైన రక్షణ ఒప్పందాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి.

ఇందులో భారత సైన్యం కోసం స్ట్రుకర్ యుద్ధ వాహనాలు, జా వెలిన్ యాంటీ క్షిపణులతో పాటు నౌకాదళం కోసం ఆరు బోయింగ్ పీ గూఢచార విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలు కూడా ఉన్నాయి. అ యితే ఈ ఒప్పందాలను ఖరారు చేసేందుకు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తర్వ లో వాషింగ్టన్‌లో పర్యటించాల్సి ఉంది. అ యితే ప్రస్తుత పరిస్థితులు దృశ్యా రాజ్‌నాథ్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు సమాచారం.’ అని పేర్కొంది.