calender_icon.png 9 August, 2025 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనాలో జల విలయం

09-08-2025 02:58:27 AM

వరదలకు 17 మంది మృతి, 33 మంది గల్లంతు

బీజింగ్, ఆగస్టు 8: చైనాలోని వాయువ్య గన్సు ప్రావిన్స్‌లో శుక్రవారం మెరుపు వరదలు విలయం సృష్టించాయి. ఆకస్మిక వర దలతో దాదాపు 17 మంది మృతి చెందగా, మరో 33 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితిని అధ్యక్షుడు జిన్ పింగ్ సమీక్షించారు. పూర్తి స్థాయి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. దయువాన్ అనే గ్రామంలో వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి చెందారు.

ఈ ఘటనలో మరో ఏడుగురికి గాయాలయినట్టు తెలుస్తోంది. గడి చిన 48 గంటలుగా భారీ వర్షాలు చైనా జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఏం డ్లుగా ఇంత భారీ వర్షాలు కురవలేదని అధికారులు పేర్కొన్నారు. 19వ దశకంలో ఆగ స్టులో ఇంత భారీ వర్షాలు కురిశాయని, మ ళ్లీ ఆ తరహాలో కురవడం ఇదే అని తెలిపారు. భారీ వర్షాల వల్ల విమాన సర్వీసుల కు కూడా అంతరాయం కలిగింది. ఈ భారీ వర్షాల వల్ల అంటువ్యాధులు విజృంభిస్తాయని అధికారులు భయపడుతున్నారు.