calender_icon.png 9 August, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉజ్వల్ యోజనకు 12వేల కోట్ల రాయితీ

09-08-2025 03:01:53 AM

10.33 కోట్ల మంది కుటుంబాలకు లబ్ధి

4,200 కోట్లతో మెరిట్ స్కీం

అస్సాం, త్రిపుర రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ

కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన అశ్వినీ వైష్ణవ్

న్యూఢిల్లీ, ఆగస్టు 8: ప్రధాని నరేంద్ర మో దీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర క్యా బినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు క్యాబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వె ల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. పీఎం ఉజ్వల్ యోజన పథకాన్ని కొనసాగించనున్నట్టు తెలిపారు. 2025- ఆర్థిక సంవ త్సరానికి గానూ ఉజ్వల యోజన కోసం రూ. 12,060 కోట్ల రాయితీ ఇచ్చేందుకు కేం ద్రం ఆమోద ముద్ర వేసిందన్నారు.

ఈ పథకంతో 10.33 కోట్ల కుటుంబాలు లబ్ధి పొం దనున్నాయన్నారు. పీఎం ఉజ్వల్ యోజన పథకానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కిందన్నారు. కాగా ఈ పథకాన్ని ప్రధాని మోదీ మే 1, 2016న ప్రారంభించారు. అస్సాం, త్రి పుర రాష్ట్రాలకు రూ. 7,250 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీనితో పాటు రూ. 4,200 కోట్లతో మెరిట్ స్కీమ్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదించిందని అశ్వినీ వివరించారు.

సాంకేతిక వి ద్యాసంస్థలు బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంజినీరింగ్, పా లిటెక్నిక్ కాలేజీల అప్‌గ్రేడ్.. మరక్కనం, పు దుచ్చేరి నాలుగు లేన్ల హైవే కోసం రూ. 2,157 కోట్లు, ప్రభుత్వ రంగ చమురు మా ర్కెటింగ్ కంపెనీలకు పరిహారం కోసం రూ. 30 వేలు కేటాయిస్తూ కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని అశ్వినీ వెల్లడించారు.