24 July, 2026 | 3:25 AM

గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ తప్పనిసరి

24-07-2026 12:00 AM

అయిజ, జూలై 23 : అయిజ మున్సిపాలిటీ కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశా లలో గురువారం ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ శ్వేత మాట్లాడుతూ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో హెచ్పీవీ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. 20112012 సంవత్సరాల్లో జన్మించిన అర్హులైన బాలికలకు ఈ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించా లని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఏఎన్‌ఎం ప్రమీ ల, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.