7 April, 2026 | 2:20 AM

నిరాహార దీక్షను విజయవంతం చేయాలి

07-04-2026 12:00 AM

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి 

హుజురాబాద్, ఏప్రిల్ 6:(విజయ క్రాంతి) హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేయనున్న డం ప్ యార్డుకు వ్యతిరేకంగా 24 గంటల నిరాహార దీక్షక చేయనున్నట్లు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. సోమవారం అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన 24 గంటల నిరాహార దీక్షకు కౌశిక్ రెడ్డి మద్ధతు తెలిపారు. స్వయంగా వెళ్లి దీక్షా శిబిరం బీజేపీ నాయకులకు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డంప్ నిర్మాణంతో హుజురాబాద్ చుట్టు 30 కిలోమీటర్ల మేర జీవకోటి మనుగడ ప్రశ్నార్థకమవుతుందన్నారు. కరోనా వైర స్ కంటే డంప్ యార్డ్ అత్యంత ప్రమాదకరమని అన్నారు. అలాగే మంగళవారం 24 గంటల నిరాహార నిరసన దీక్షల్లో తాను స్వ యంగా పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ దీక్షకు మద్ధతుగా హుజురాబాద్ ప్రజానీకం పెద్దఎత్తున కదిలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

పార్టీలకు అతీతంగా పోరాడటం ద్వారా డంప్ యార్డు నిర్మాణాన్ని అడ్డుకోవచ్చని, తద్వారా ప్రాణాలు నిలుపుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నా యకులు, బీజేపీ , బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.