calender_icon.png 8 January, 2026 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొల్లాపూర్‌లో విదేశీయుల సందడి..!

05-01-2026 12:00:00 AM

సోమశిల, మంచాల కట్ట వద్ద ప్రత్యేక ఆకర్షణగా పర్యాటకులు

కొల్లాపూర్ రూరల్, జనవరి 4 : కొల్లాపూర్ పట్టణంలో గత కొన్ని రోజులుగా విదేశీ పర్యాటకులు సందడి చేస్తున్నారు. పుణ్యక్షేత్రాలు, కృష్ణా నది తీర ప్రాంతాలను వారు ఆసక్తిగా సందర్శిస్తూ స్థానికుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. విదేశీయులను చూసిన కొల్లాపూర్ యువత వారితో మాట కలపడానికి ముందుకొచ్చి ఉత్సాహంగా సంభాషణలు జరుపుతున్నారు. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, తెలుగు భాషల మిశ్రమంతో సాగుతున్న సంభాషణలు ఆకర్షణగా మారాయి. విదేశీయులు కూడా వచ్చిరాని తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌లో స్పందిస్తూ నవ్వులు, స్నేహపూర్వక మాటలతో ప్రాంతాలను సందడిగా మార్చారు. విదేశీయులతో మాట్లాడేందుకు యువతలో ప్రత్యేక ఉత్సాహం కనిపించగా, కొల్లాపూర్‌కు పర్యాటక కేంద్రంగా ఆదరణ పెరుగుతోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.