05-01-2026 12:00:00 AM
వనపర్తి, జనవరి 4 ( విజయక్రాంతి): వనపర్తి జిల్లా జగత్ పల్లి పాఠశాల లో పని చేస్తున్న వి. జ్యోతిర్మయికి దక్షిణ భారతదేశం ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు తీసుకున్నారు. శనివారం సావిత్రిబాయి పూలే జయంతి పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ గురు చైతన్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వరంలో ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు కార్యక్రమంలో జగత్ పల్లి స్కూల్ ఉపాధ్యాయురాలు వి. జ్యోతిర్మయి పెద్దగూడెం స్కూల్ అసిస్టెంట్ రాధిక ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డులు అందుకున్నారు.
వారిని విజయవాడలో ఘనంగా సన్మానించారు. అవార్డు అందుకున్న వారు మాట్లాడుతూ అవార్డు రావడం గౌరవంగా ఉందని రాబోయే రోజుల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం కోసం సహకారాలు అన్నిటిని పెట్టి కృషి చేస్తామన్నారు. జగత్ పల్లి స్కూల్ కి దక్షిణ భారతదేశ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా సెలెక్ట్ అవడంతో చాలా సంతోషంగా ఉందని తోటి ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయులు, హర్షం వ్యక్తం చేశారు.