02-11-2025 05:42:01 PM
మెట్ పల్లి (విజయక్రాంతి): మెట్ పల్లి గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో పెద్ద చెరువు వద్ద గంగా మాత దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఆదివారం జరిగింది. రెండవ రోజు ఉదయం హోమము, కర్మణా పుణ్యవచనం, స్థాపిత దేవాతర్చనం, మంత్రపుష్పం ప్రత్యేక పూజ అనంతరం మహిళలతో కుంకుమ అర్చన కార్యక్రమం వేదమంత్రాలతో మూల మంత్ర హోమములు సంబర హోమములు స్వప్నం ధాన్యపల పుష్ప షయ్యాది వాసనం మంగళహారతి కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం తీర్థప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది.
అనంతరం నిర్వాహకులు మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షులు పర్రె శంకర్ మాట్లాడుతూ మూడు రోజులపాటు ప్రతిష్టా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. సోమవారం రోజు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం, కళ్యాణం, అన్నా ప్రసాదము కార్యక్రమం ఉందని ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘ అధ్యక్షులు ఆర్మూర్ నరేందర్, బెస్త సంఘం అధ్యక్షులు మాన్కాల చిన్నయ్య, ఆర్మూర్ రాజేష్, కుడుముల సాయన్న, మాన్కాల పోచయ్య, మగిడి సురేష్, పర్మి నర్సయ్య, ఆర్మూర్ గంగన్న, పారుపల్లి రమేష్, పరిమి లక్ష్మణ్, పారిపెల్లి కిషన్, ఆర్మూర్ రంజిత్, మాన్కాల గంగాధర్, గంగపుత్ర సంఘ సభ్యులు పాల్గొన్నారు.