27-11-2025 12:23:35 AM
మెదక్ జిల్లా విద్యాధికారి కె.విజయ
చేగుంట, నవంబర్ 26 :చేగుంట మండ ల కేంద్రంలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంటలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడైన చల్లా లక్ష్మణ్ రా జ్యాంగ పరిషత్ లోని సభ్యులందరి ఫోటోలను సేకరించి ఫోటో గ్యాలరీ నిర్వహిం చారు. ఈ కార్యక్రమాన్ని మెదక్ జిల్లా విద్యాధికారి కె.విజయ ప్రారంభించారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ ఫోటో గ్యాల రీ ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులలో రాజ్యాంగం పట్ల అవగాహన కలుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఏఎంఓ సుదర్శనమూర్తి, మండల విద్యాధికారి నీరజ, ఇన్చార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వర్, రఘుపతి, సుధాకర్ రెడ్డి, రాధ, సరస్వతి, రమా, రమాదేవి, శారద, రేఖ,రావుల వెంకటేష్,మ నోహర్ రావు, సురేందర్, శ్రీ వాణి , ఉమా, ఉమామహేశ్వరి, హిమవర్ష, సిఆర్పి రమేష్, సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.