calender_icon.png 27 November, 2025 | 10:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోయపంట కొనాలని రైతు ఆమరణ నిరాహార దీక్ష

27-11-2025 12:23:07 AM

-కుంటాల మండల కేంద్రంలో దీక్ష చేపట్టిన అన్నదాత దత్తాద్రి

-రైతులతో మాట్లాడిన మార్క్‌ఫెడ్ డీఎం మహేష్ 

కుంటాల, నవంబర్ 26 (విజయ క్రాం తి): రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యం లో కొనుగోలు చేసిన సోయపంటలు నాణ్యత పేరుతో రైతులకు తిరిగి పంపడపై నిరసిస్తూ కుంటాల మండల కేంద్రం చెందిన రైతు పడకండి దత్తు బుధవారం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు . కుంటాల మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద సుమారు 200 మంది రైతుల మద్దతుతో ఈ దీక్షను చేపట్టినట్టు తెలిపారు.

700 సోయా బస్తాలు వాపస్ వచ్చిన అధికారులు ఆ పంటను తిరిగి కొనుగోలు చేర్పడంపై రైతులు పడుతున్న ఆవేదనకు మద్దతుగా తాను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినట్టు తెలిపారు. రైతుల పట్ల ప్రభుత్వం అధికారులు మొండిగా వివరించడం పై ఆయన మండిపడ్డారు. తిప్పి పంపిన సోయను తిరిగి కొనుగోలు చేస్తామని అధికారులు హామీ ఇచ్చిన దాన్ని నెరవే ర్చకపోవడం వలన తాను పోరాటం చేస్తు న్నానని సమస్య పరి ష్కారం అయ్యేవరకు తమ దీక్ష కొనసాగి స్తానని అవసరమైతే ప్రాణ త్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

ఈ దీక్షకు బీఆర్‌ఎస్ నేతలు మాజీ జెడ్పీ చైర్మన్ శ్యాంసుందర్ నాయకులు విలాస్‌గా దేవర్ దశరథం పోశెట్టి  దీక్షిత్ పటేల్ తదితరులు సంఘీభావం తెలిపారు పడకండి దత్తుకు మద్దతుగా రైతులు ఈ దీక్షలో పాల్గొన్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న మార్క్‌ఫెడ్ డీఎం మహేష్ అక్కడికి వచ్చి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్కు ఫోన్లో మాట్లాడిన స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని రైతు దత్తు హెచ్చ రించారు ఈ కార్యక్రమంలో మండల నాయ కులు యువకులు పాల్గొన్నారు