24 April, 2026 | 3:28 AM

ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చాలి

24-04-2026 01:16 AM

లేదంటే ఉద్యమిస్తాం: హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వి.సతీష్ కుమార్

హుస్నాబాద్, ఏప్రిల్ 2౩: ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వి.సతీశ్ కుమార్ హెచ్చరించారు. గురువారం హుస్నాబాద్లో కార్మికులకు మద్దతుగా సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ మాట్లాడుతూ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, 30 శాతం ఫిట్మెంట్ అమలు చేసి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో ప్రభుత్వం సరైన నిధులు విడుదల చేయడం లేదని ఆరోపించారు. మహిళా కార్మికుల సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. రెండు మూడు రోజుల్లో సమస్యలపై స్పందించకుంటే పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడి కార్మికుల పక్షాన నిలవాలని కోరారు.