calender_icon.png 19 December, 2025 | 4:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచులను సన్మానించిన కాటా దంపతులు

18-12-2025 12:00:00 AM

గ్రామాభివృద్దే లక్ష్యంగా పనిచేయాలి

అమీన్ పూర్, డిసెంబర్ 17 : పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలంలోని గ్రామ పంచాయతీలకు మొదటి విడత ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నాయకులు సర్పంచులుగా విజయం సాధించగా సర్పంచులతో పాటు వార్డు మెంబర్లను పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, ఆయన సతీమణి కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ బుధవారం ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి విడత స్థానిక ఎన్నికల్లో నూతనంగా విజయం సాధించిన సర్పంచులు గ్రామంలో వీధిలైట్లు, శానిటేషన్, గ్రామస్తులకు తాగునీరు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.

ఓటమి పాలైన కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ అధైర్యపడవద్దని వారందరూ సమయాభావంతో ఉండి గ్రామాల్లో మరింత సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నూతన సర్పంచులు, ఉప సర్పంచ్లు , వార్డు సభ్యులు పాల్గొన్నారు.