18-12-2025 12:00:00 AM
మంథని డిసెంబర్ 17 (విజయక్రాంతి) పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని అడవి సోమనపల్లి గ్రామ శివారులో ఉన్న మానేరులోని చెక్ డ్యాం కొట్టు పోయింది. స్థానికుల కథను ప్రకారం అడవి సోమన్ పల్లి మానేరులో గత ప్రభుత్వం చెక్ డ్యాం నిర్మాణం జరిగింది. ఈ చెక్ డ్యాంతో రైతులకు రెండు పంటలకు నీరు నిల్వ ఉండడానికి నిర్మించారు. బుధవారం ఉద యం చెక్ డ్యాం నీటిలో కొట్టుకు పోయి, నీరు కిందికి పోతుండడంతో స్థానికులు చూసి ఆశ్చర్యపోయారు.
కోట్ల రూపాయల తో నిర్మించిన చెక్ డ్యాం ఇలా వరదకు కొట్టుకపోవడంతో అనిధులు నీళ్ల పాలు అయ్యాయని స్థానికుల తెలిపారు. అసలు ఈ చెక్ డా ం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిందా లేక ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తు లు ధ్వంసం చేశారా అని రైతులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని చెక్ డ్యాం ఎలా కొట్టుకు పోయిందని విచారణ చేపట్టుతున్నారు. ఈ విషయంపై అధికారులను వివరణ కోరగా తర్వాత చెప్పుదామని దాటవేశారు.