27 April, 2026 | 3:36 AM

లేబర్ కోడ్స్ రద్దు చేయాలి

27-04-2026 01:26 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): కార్మికులు పోరాడి సాధించుకున్న 140 మే డే దినోత్సవాన్ని లేబర్ కోడ్లను రద్దు చేయాలనే డిమాండ్ తో నిర్వహించాలని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు హలవత్ లింగన్న, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు పర్వత కోటేష్ కార్మికులకు పిలుపునిచ్చారు.

ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మేడే గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమెరికాలోని చికాగోలో 8 గంటల పని దినానికై కార్మికుల పోరాట ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది గంటల పని విధానం నేడు అమలవుతుందని, ప్రధానినరేంద్ర మోడీ కార్మికుల శ్రేయోభిలాషి అంటూ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి, 12 గంటల పని విధానం తీసుకురావడంలో మోడీ అసలు రూపం బయటపడిందన్నారు.  కార్మికులను మనుషులుగా కూడా గుర్తించని దుర్మార్గపు కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పి కొట్టాలన్నారు.